Home భక్తి సమాచారం ఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు

ఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు

59
0

పాముల నర్సయ్య గారు విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన వారు. చెరుకుమిల్లి వెంకట నరసింహారావు అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ మంత్రశక్తి ఆయనను పాముల నర్సయ్యగా మార్చేసింది. చిన్న వయసులో ఒకసారి కాశీ వెళ్లారు.అక్కడ గంగానదిలో స్నానం చేస్తుండగా అదే సమయంలో ఆనాటి శృంగేరి పీఠాధిపతి కూడా అక్కడికి రావడం జరిగింది.ఆ శృంగేరీ పీఠాధిపతి నర్సయ్యను చూసి, ఇతనిలో ఏదో దివ్యత్వం దాగి ఉంది, ఇతని వల్ల ఒక మహత్కార్యం జరగాల్సి ఉందని గ్రహించి ఆయనకు గారుడీ మంత్రాన్ని ఉపదేశించారు. విషాన్ని హరించే మంత్రం అది. నర్సయ్య ఆ మంత్రాన్ని ఎన్నో ఏళ్ల పాటు భక్తిశ్రద్ధలతో జపించి శక్తిని సాధించారు. ఆ మంత్రశక్తితో ఆయన పాముకాటుకు గురైన ఎంతోమందిని కాపాడారు.

నరసయ్య గారి జీవితానికి ఓ మలుపు…

ఓ బ్రిటిష్ అధికారిని కాపాడటం పాముల నర్సయ్య గారి జీవితానికి ఓ మలుపు గా మారిందని చెప్పవచ్చు. అ మలుపే ఎంతో మందికి ప్రాణదానం జరిగేటట్లు చేసింది. ఒక్కసారి ఓ బ్రిటిష్ అధికారి పాముకాటుకు గురి అయ్యాడు.కొంతమంది చెంచులు పసరు మందు వేసినా ఫలితం కనపడలేదు.శరీరమంతటికీ విషం పాకిపోయింది. ఇక కొద్ది క్షణాల్లో చనిపోతాడు అనగా అటుగా వెళ్తున్న నరసయ్యకు ఈ విషయం తెలిసి ఆ బ్రిటిష్ అధికారి చెవిలో మంత్రాన్ని చెప్పాడు. కాసేపటికి ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వేలో ఉద్యోగం ఇవ్వడమే కాదు, ఆయన కూర్చున్న చోట ఫోన్ కూడా ఏర్పాటు చేశారు.

ఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు .ఇప్పుడు 108 అంబులెన్స్ నెంబర్ ఎలా ఉందో అలా నర్సయ్య గారి ఫోన్ నెంబరు నాటి జనం నోళ్ళలో నానింది. ఆ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసి పాము కాటుకు గురయ్యారు అని చెబితే చాలు ,నరసయ్యగారు ఆ పాము మంత్రాన్ని పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో చెప్పి విషాన్ని దించేసేవారు. ఇలా కేవలం ఫోన్ ద్వారానే మంత్రం చెప్పి కొన్ని వేలమందిని బతికించారు .కానీ ఏనాడు ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మద్రాసు రైల్వే సూపరింటెండెంట్ గా బదిలీ చేసినా,అక్కడ కూడా ఇదే విధంగా ఫోను ఏర్పాటు చేయడం జరిగింది.

వైద్యం ఎలా చేసేవారంటే…

మంత్రం పనిచేయాలంటే కొంతమంది స్పర్శ ద్వారా చేస్తారు. మరి కొంతమంది తీర్థం ఇచ్చి మంత్రం పని చేసేలా చేస్తారు. కానీ నర్సయ్య గారు ఫోన్ రిసీవర్ తో నయం చేసేవారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది వాస్తవం వైద్యం ఎలా చేసేవారంటే విజయవాడలోని ఓ వ్యక్తికి పాము కరిచినట్లు ఫోన్ వస్తే ఆ ఫోన్ రిసీవర్ ను పాము కరిచిన వ్యక్తి చెవి దగ్గర పెట్టు అనేవారు. నరసయ్య భుజం మీద ఎప్పుడూ గుడ్డ పీలికలు ఉండేవి .దాంట్లోని ఓ పీలికనకు ముడి వేసి ఆ తర్వాత పాము కాటు వేసిన వ్యక్తికి చెవిలో గారుడీ మంత్రాన్ని చెప్పేవారు. కాసేపు ఆయన కళ్ళు మూసుకొని ఉపా‌సన చేసేవారు .దిగిపోతుందని చెప్పే వరకు ఆయన పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో ఏదో చెబుతుండే వారు . విషం దిగిపోయింది అని చెప్పిన తర్వాత ఆ గుడ్డ పీలికలలో కొంచెం ఇసుక వేసి దానిని చెట్టుకు కట్టివేసేవారు. దాంతో ఆ ప్రక్రియ పూర్తయినట్లు. ఇలా కొన్ని వేలమందిని ఆయన గారుడీ మంత్రంతో బతికించారు.

Previous articleసీతాదేవికి అగ్ని పరీక్ష
Next articleఎలుకలు తిన్న ఆహారాన్నివడ్డించేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here