Home స్పూర్తి బ్రాహ్మణత్వం పుట్టుకతో వచ్చేది కాదు..!

బ్రాహ్మణత్వం పుట్టుకతో వచ్చేది కాదు..!

41
0

★ బ్రాహ్మణత్వం పుట్టుకతో వచ్చేది కాదు జన్మసంస్కారం తో వస్తుందని విశ్వసించిన మహనీయుడు, కోట్లమంది భక్తులు ఆరాధించే సత్యసాయిబాబా గౌరవాన్ని అందుకున్న మహాత్ముడు, జీవితమంతా అవిశ్రాతంగా సనాతన వేదధర్మ సంరక్షణ కై జీవించిన ప్రాతఃస్మరణీయుడు, తెలుగువారి ఇలవేల్పు శ్రీ వేంటేశ్వరస్వామి ప్రియభక్తుడు,మూర్తీభవించిన వేదమూర్తి పూజ్య “ఉప్పులూరి గణపతి శాస్త్రి” గారి ఆరాధనా

★ వీరి జన్మస్థలం తూర్పుగోదావరి.చిన్నతనంలోనే ఆంగ్లవిద్య అనే మిథ్యను ఇష్టపడక సంప్రదాయ వేదశాస్త్రాల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకున్నారు.ఆధునికంగా వేదసారాన్ని ప్రచారం చేయడంలో వీరు నిర్వహించిన పాత్రను వివరించడా నికి అక్షర లక్షలు కావాల్సిందే.ఇటువంటి మహనీయు ల సనాతన ధర్మ భక్తి వల్లే ఇస్లానిక్,కైస్తవ దురాక్రమణ ల నుంచి మన భారతీయ ధర్మ వైభవం కాపాడ బదుతూ ఉంది.ఇప్పుడున్న పాలకుల నుంచి ఆ భారతీయ ధర్మ ఊపిరి దీపాన్ని ఆర్పాలన్న కుట్రలను మరింత జాగురూకతతో కాపాడుకోవాలి మనం.

★ వారి తండ్రి శ్రీ ఉప్పులురి గంగాధార శాస్త్రి గారు. స్వయంగా వ్యాకరణ శాస్త్రంలో, భాష్యాలు, వేదాలు మరియు తర్క శాస్త్రం ఇతర అసంఖ్యాక వైదిక విభాగాలలో గొప్ప పండితులు.గత ఎనిమిది తరాలుగా వారు చేస్తున్న వేదపరిరక్షణ దేశ వ్యాప్తంగా స్తుతిపాత్రమైనది.

★ కుమారుడు గణపతి శాస్త్రి ఇష్టాన్ని గమనించి ఆప్యాయత తో కఠిన మార్గాన ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు యువ గణపతి శాస్త్రీని మేల్కొలిపి, కళ్ళ మీద చల్లటి నీరు చల్లిన తరువాత వేదాలను బోధించడం ప్రారంభించేవారు. తన తండ్రి మార్గానిర్దేశకత్వానికి లోపం రానీకుండా గణపతి శాస్త్రి గారు త్వరలోనే సంస్కృత వ్యాకరణంలో నిపుణుడిగా రూపాంతరం చెందారు.వేదాల వ్యాఖ్యానంలో ప్రవీణుడిగా నిలిచారు. కృష్ణ యజుర్వేదం, సామ వేదం, ప్రకరణాలు, (సోమంతం) కంద త్రయం,యజ్ఞ ,యాగ ప్రక్రియ నిపుణత,జ్యోతిష శాస్త్రం, ఉపనిషత్తులు ఇత్యాది వేదవేదాంత వాఙ్మయాన్ని నేర్చిన ఆధునిక అగస్త్యమహర్షి అయినారు.

★ ఆయనకు వేదభాష్య విశారద, వేదభాష్యా లంకార, సాంగ వేదార్థ వాచస్పతి, వేదభాష్యాచార్య, ఆమ్నాయ సరస్వతి, కళాసరస్వతి అనే గౌరవ పురస్కారాలను సాధించారు.తండ్రిని మించిన తనయునిగా రాణించి తండ్రి పేరు ను నిలపారు. హైదరాబాదులో ఆయన పేరుమీదుగా “ఉప్పులూరి గణపతి శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తు” అనే సంస్థ ఉంది అది గణపతి శాస్త్రి గారి ఆశయమైన వేదపరిరక్షణ కై శ్రమిస్తూ ఉంది.

★ వంశపారంపర్యంగా ఆయన పిఠాపురం సంస్థానంలో ఆస్థాన విద్వాంసులు.వారి విద్వత్తును ఎరుకలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆస్థాన వేదపండితునిగా ఆయనను నియమించుకొని తమ గౌరవాలని పెంచుకున్నాయి.

★ పి.వి.ఆర్.కె ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధి కారిగా ఉన్నప్పుడు ఓ సారి అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.అప్పుడు ఆయన గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో వరుణయాగం జరిపించడంతో తిరుమలలో వర్షం పడింది.ఇది చారిత్రిక సత్యం.

★ పీవీఆర్కే ప్రసాద్ ఐఏఎస్ ఓ సందర్భం లో ప్రధాని పి.వి.నరసింహా రావు గారి తో సనాతన ధర్మ సంబంధమైన పూజలు, యజ్ఞాలు, హోమాలు గూర్చి మాట్లాడే సందర్భం లో “హైదరాబాద్ లో ఉప్పులూరి గణపతి శాస్త్రి అనే వేదపండితులు ఉండేవారు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేసే సమయంలో టీటీడీ ఆస్థాన విధ్వంసుడిగా, వేదశాస్త్ర సంరక్షణ పథకాలకు సలహాదారునిగా ఆయనను నియమించాం.◆ గణపతి శాస్త్రిగారు 48 సంవత్సరాల పాటు నిర్విరామంగా వేదాధ్యానం చేసి వేదాలను, ఉపవేదాలను అవపోసన పట్టినారు. ఒకసారి తిరుపతి తిరుమల ప్రాంతమంతా తీవ్ర వర్షాభావం ఏర్పడింది. అప్పటికి తిరుమలకు మంచినీటి సరఫరా జరిగేది ఒక్క గోగర్భం డ్యామ్ నుంచి మాత్రమే. ఆ డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది, ఆ సమయంలో కొండమీద నీటికి కటకటా మంటుంటే భక్తులను తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని అడగాల్సినంత ఘోరమైన స్థితి వచ్చింది. ◆ దిక్కు తోచక నేను గణపతి శాస్త్రిగారిని సంప్రదించి, వర్షం కురిసి, తిరుమలలో మంచి నీటి కొరత నుంచి రక్షించేందుకు వేదాలలో పరిష్కారం ఉందా అని అడిగాను దానికి శాస్త్రిగారు “నిష్ఠతో నిష్ణాతులైన పండితులు వేదాలలో చెప్పబడిన విధంగా జపాలు చేస్తే వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయన చెప్పినట్లే నిష్ఠతో అయన మార్గదర్శకత్వంలో నియమ నిబంధనలతో జపాలు చేసే ఋత్వికుల్ని పిలిపించి తిరుమల కొండ మీద వరుణ జపం చేయించడం జరిగింది.◆ మమల్ని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ వరుణ జపం చివరి దశలో ఉండగా తిరుమల కొండ మీద కుండపోతగా వర్షం కురిసింది, గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే తిరుమల కొండ క్రిందగాని, చుట్టుపక్కలాగాని ఒక్క చుక్క వర్షం కురవలేదు” అన్నారు.కానీ,మన దురదృష్టం మన భారతీయులకు వేదాసారాన్ని అర్థం చేసుకోనంతటి మేథస్సు,మనస్సు లేకపోవడం తో ధార్మిక సత్యాలను అనుమానిస్తూ అవమానిస్తూ అల్పమనస్కులుగా మారి పోతుండడం బాధాకరం.

★ ఆయన 18వ ఏటనే ఒక క్రతవుకు అధ్వరులుగా ఉన్నారంటే వారి సార్థక జన్మ మన తెలుగు నేలపై ఊపిరి పోసుకోవడం తెలుగు జాతినంతా ధన్యులను చేసింది.ఆయన హైదరాబాదు వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం నుండి రోజూ పన్నెండు మైళ్ళు నడచి చిక్కడపల్లిలోని వేదసంస్థలో జరిగే గణ స్వస్తి కొరకు వెళ్ళేవారు. శిష్యులతో కలిసి దారంతా వేదాలను వల్లె వేస్తూ వెళ్ళేవారు. కనీసం పాదరక్షలు కూడా ధరించేవాడు కాదు. లౌకిక విషయాలు పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు.కానీ వేదంలోని ప్రతి అక్షరం వెనుక భావాన్ని చిన్నపిల్లలకు సైతం అర్థం అయ్యేలా వివరించగల ప్రతిభామూర్తి.కాబట్టీ సత్యసాయిబాబా ఆయనమీద ఎంతో గౌరవంతో తన ఆశ్రమమైన ప్రశాంతి నిలయంలో యజ్ఞయాగాదుల ను నిర్వహించడానికి ఆహ్వానించేవారు.సనాత వైదిక ధర్మ మూర్తిగా భావించి వారిని గౌరవించేవారు.1985 లో భారతప్రభుత్వం పద్మభూషణ్ బహుమతితో సత్కరించింది. శత వసంతాలు చూసిన ఆయన జులై 17 1989 తేదీన తన భౌతికకాయాన్ని త్యజించారు.

★ మన సంస్కృతి,సంస్కార,సంప్రదాయాలకు తమ జీవితాన్ని సర్పించుకున్న ఇటువంటి మహాత్ములను స్మరించక పోవడం వల్లే మనం వృద్ధిని సాధించలేక పోతున్నాము.అవును, మన ఆంధ్రజాతి కోసం, భారతీయల కోసం జీవించిన వీరిని గుర్తుపెట్టుకోలేక పోవడమనే కృతఘ్నతను విడిచి కృతజ్ఞతను చూపుదుముగాక!అట్టి నమ్మిక ఉన్న వారి పై వారి ఆత్మ తప్పక ఆశీర్వదించునుగాక!

Previous articleఒక నది కోపంగా ఉండిపోయింది …!
Next articleపురాతన ఇనుప బ్రిడ్జి తుప్పు పట్టి కూలిపోయే పరిస్థితి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here