Home మన మహనీయులు ఎలుకలు తిన్న ఆహారాన్నివడ్డించేవారు.

ఎలుకలు తిన్న ఆహారాన్నివడ్డించేవారు.

52
0

అపర దధీచి జతీంద్రనాథ దాస్ –

చరిత్రలో కాలగర్భాన కలసి పోయిన మహనీయులు ఎందరెందరో . ఎవరో చెబితే తప్ప మనకు కూడా పెద్దగా తెలియని కథలు గాథలు ఎన్నెన్నో . అది దేశ స్వాతంత్ర సమరం ముమ్మరంగా జరుగుతున్న రోజులు . దేశ మాత దాస్య శృంఖలాలు తెంచడానికి తమ వంతు కృషిగా ప్రతీ భారతీయుడు కృషి చేసిన రోజులు అవి . జతీంద్రనాధ్ దాస్ 1904 అక్టోబర్ 27 న కలకత్తాలో ఒక సాంప్రదాయ కుటుంబములో జన్మించారు . ముక్కుపచ్చలారని వయస్సులోనే చదువుకుంటున్న రోజుల్లో సహచరులతో కలసి విప్లవమార్గం చేబట్టి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటబాటన పట్టారు. నాడు మహాత్మా గాంధీ చేబట్టిన సహాయ నిరాకరణోద్యమంలో సైతం తన పదిహేడవ ఏటనే పాల్గొని ఆంగ్లేయులకు ఎదలో ములుకుగా తయారయ్యాడు.

జతీంద్రనాధ్ బి ఏ చదివే సమయములో ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు వ్రాస్తూ సహచరుల్లోనూ ప్రజల్లో ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు వారిలో పోరాట పటిమను పెంచేవాడు. ఈ చర్యలు గమనించిన నాటి ఆంగ్ల ప్రభుత్వం జతీంద్రనాథ్ ని 1925 లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది . అక్కడ సాటి భారతీయ ఖైదీలకు ఆంగ్ల ప్రభుత్వం జరుపుతున్న అవమానాలు వ్యతిరేకంగా ఇరువది రోజుల పాటు కనీసం నీళ్లు కూడా పుచ్చుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష జరిపాడు. దీనితో కదలివచ్చిన ఆంగ్ల ప్రభుత్వం క్షమాపణ కోరి ప్రభుత్వ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలకు సదుపాయాలు కలిగే చేస్తాం అని మాట ఇచ్చి నిరాహార దీక్ష మానిపించారు.

ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశమంతా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. అదే సమయములో దేశములో నలుమూలలా ఉన్న వివిధ విప్లవకారులతో పరిచయాలు పెరిగాయి. భగత్ సింగ్ వంటి వారితో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. విప్లవమార్గం పట్టిన జతీంద్రనాథ దాస్ ఆంగ్ల ప్రభుత్వ అధికారులు మీద వారి భవనాల మీద బాంబుల దాడులు జరపాలని నిశ్చయించుకుని బాంబులు ఎలా చేయడం అనేది శచీంద్రనాథ్ సన్యాల్ వద్ద నేర్చుకున్నారు. అనేక విప్లవ వీరులకు బాంబులు ఎలా చేసి దాడులు ఎలా చాకచక్యంతో నేర్పించాలో జతీంద్రనాథ నేర్పించేవాడు. ఇవన్నీ గమనించిన ఆంగ్ల ప్రభుత్వం జతీంద్రనాథను 1929 జూన్ 14 న అరెస్ట్ చేసి లాహోర్ జైల్లో పెట్టించారు.

లాహోర్ జైల్లో శిక్ష అనుభవసితున్న జతీంద్రనాథ అక్కడ జైలు అహఁధికారులు చూపుతున్న వివక్షను సహించలేక పోయాడు. భారతీయ ఖైదీలకు సరి అయినా యూనిఫార్మ్స్ లేదు. అవి నెలలో ఏ ఒకటో రెండు రోజులో ఉతుక్కునే అవకాశం కల్పించేవారు. ఎక్కడ చూసినా నల్లులు , బొద్దింకలు , ఎలుకలు.. చివరకు బొద్దింకలు పారాడిన ఆహరం ఎలుకలు తిన్న ఆహారాన్ని సైతం ఖైదీలకు అలాగే వడ్డించేవారు.భారతీయ ఖైదీలకు కనీస వసతులు కూడా కల్పించకుండా దేశములో ఏం జరుగుతున్నదో తెలియనీయకుండా కనీసం పత్రికలు కూడా అందించేవారు కాదు. తమ బాధను వెళ్లగక్కేందుకు వ్రాయడానికి పేపర్ ని సైతం అందించేవారు కాదు. చిత్ర హింసలపాలు చేసేవారు. దీనికి వ్యతిరేకంగా జతీంద్రనాథ సరిగ్గా తొంబై యేళ్ళ క్రితం ఈనాటి రోజు జులై 14 1929 న ఆమరణ నిరాహార దీక్ష చేబట్టాడు. దాదాపు అరవై మూడు రోజులబాటు సాగిన ఈ నిరాహార దీక్షకు మద్దతుగా దేశములో ఉన్న అనేకమంది భారతీయ ఖైదీలు స్వచ్చందంగా మద్దతునిచ్చారు. బెయిలు మీద విడుదల చేయడానికి అంగీకరించిన ఆంగ్ల ప్రభుత్వం దిగివచ్చిన రోజునే సెప్టెంబర్ 13 1929 న జతీంద్రనాథ తల్లి భారతి ఒడిలో ప్రాణాలు వదిలాడు.

Previous articleఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు
Next articleపూజలు నోములు వ్రతాలు వంటలు లో నాకు రైట్ హ్యాండ్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here