Home స్పూర్తి పూజలు నోములు వ్రతాలు వంటలు లో నాకు రైట్ హ్యాండ్..

పూజలు నోములు వ్రతాలు వంటలు లో నాకు రైట్ హ్యాండ్..

41
0

నాలుగు ఇంగ్లిష్ ముక్కలు నేర్చుకోగానే గొప్పవాళ్ళమైపోయినట్టు బొట్టుతీసేసి పొట్టి బట్టల్లోకి దిగిపోయే అమ్మయిలని వాళ్ళని చూసి మురిసి పోయే తల్లితండ్రులని చూస్తే అటువంటివాళ్ళకి నా తోడికోడలు ని చూపించాలనిపిస్తుంది..

నాకన్నా పదేళ్లు చిన్నది.. రంగరాయ మెడికల్ కాలేజీలో మెరిట్ లో చదువుకుని పెళ్లయి USA రాగానే మొదటి సారి చూసినప్పుడు నాకు తనకి set అవుతుందా లేదా అని కుంచం భయం వేసింది… జనరేషన్ gap కదా నేనే పెద్దరికం గా జాగ్రత్త గా ఉండాలి అనుకునేదాన్ని..

అక్క అనే పిలుపుతో 12 సంవతసరాల క్రితం మొదలైన మా బంధం… ఇప్పటికి బలంగా ఉందంటే తన ఒద్దిక తనమే,

అక్క అక్క అని నా కూడా తిరిగే పిల్ల 2 పిల్లల తల్లి ఐయింది..

కష్టపడి రెసిడెన్సీచేసి pediatric గ్యాస్ట్రోఎంట్రోలజీ లో double ఫెలోషిప్ చేసి USA లో top చిల్డ్రన్స్ hospital లో పనిచేస్తూకూడా ఎక్కడ మన సంస్కృతి సంప్రదాయాలని ఇసుమoతకూడ వదిలిపెట్టకుండా పాటించే తనని రోజూ చూసే నాకు ఎంతముచ్చటగా ఉంటుందో. ఒకింతగర్వంగానూ

ఉంటుంది..

నుదుట బొట్టు పాపిట సింధూరం నిండుగా నల్లపూసలు తో hospital dress లో చూస్తే ప్రాణం పోసే పార్వతీదేవి లానే ఉంటుంది..

USA వచ్చినకొత్తలో రెసిడెన్సీ కి ఇంటర్వూస్ కి వెళుతున్నప్పుడు కొంతమంది బొట్టు తీసేయి కుంచం మోడరన్ గా ఉండు లేకపోతే నీకు రెసిడెన్సీ రావటం కష్టం అని చెప్పినవాళ్ళకి… మా అక్క wallstreet లో work చేస్తోంది. తన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే విజయాలు సాధిస్తోంది..తనే నాకు inspiration అని చెప్పేది..

తనకి రెసిడెన్సీ రావటం late ఐతే నాకు భయంవేసింది..

నాది IT నీది doctor filed నాల ఉండాలి అనుకోకు అని చెప్పేదాన్ని.. వింటేగా..

సర్లే అక్క నా కట్టు బొట్టు వల్ల రెసిడెన్సీ రాకపోతే తొక్కలో USA ఉంటాం ఏమిటి మనం సంప్రదాయం ఒదులుకుంటాం ఏమిటి అనేది..

సంస్కృతి,సంప్రదాయాన్ని ఎక్కడ విడవకుండా one of the TOP pediatric సర్జన్ అయ్యి భారతీయ స్త్రీ గొప్పతనం తన చేతలతో చూపించే సరస్వతీదేవి నా తోడికోడలు..

అక్క నీ పిల్లల్లా నాపిల్లలు పెరిగితే చాలు అంటుంది కాని నాకన్నా నేర్పుతో పిల్లలని పెంచుతోంది..

ముఖ్యం గా ఆడపిల్లని. ఒక్కనిమిషం కూడా పిల్లకి బొట్టు లేకుండా ఉంచదు….

ఏదైనా culture కి సంబంధించిన question వేస్తె ప్రణవ్ కి అప్పచెపుతుంది. అన్నమాట వింటుందని..

బావగారి మాట వేదవాక్కు….మీరుచెప్పండి బావగారు మీ మాటఫైనల్ అనే చెల్లెలి స్థానం తనది..

తిన్నావా అక్క అని రోజు lunch టైములో నాకువచ్చే phone తనదే..

ఏదయినా స్పెషల్ surgery జరిగితే నాకు చెప్పేయాల్సిందే..

పూజలు నోములు వ్రతాలు వంటలు లో నాకు రైట్ హ్యాండ్..

ప్రతిరోజూ పూజ చేసుకుని ప్రసాదం నోట్లో వేసుకుంటే గాని అడుగు బయటపెట్టదు..

ఎక్కువ stress తీసుకోకు అంటే నువ్వు చేయటంలేదా అంటుంది….ప్రతీ పండగ పూజ శాస్ట్రోక్తం గా చేయవలసిందే..

మా stress busters పిల్లలే, నలుగురు కలసి ఆడుకుంటూ ఉంటే చూసుకుని మురిసిపోతాం..

సంప్రదాయం విషయంలో ఏప్రశ్న వేసిన

అందరం డిస్కస్ చేసుకుని సమాధానం చెపుతాం..

మాటలతో కన్నా చేతలతో పిల్లలని మన సంస్కృతిక వారసుల గా ఉంచగలమని నమ్మి ఆచారించే నాకు మావారికి మీకుతోడు నీనున్న అనే support తన చేతలతో ఇస్తూనే ఉంటుంది..

ఇదంతా ఎందుకుంచెపుతున్నాను అంటే

మన సంస్కృతి సంప్రదాయాలని ఒదులుకోకుండా ఉన్నత స్థానాలని అందుకోవచ్చు అనటానికి నా తోడికోడలు ఉదాహరణ…

ఈమధ్య ఒక సోదరుడు బొట్టుమీద ఈగోలేంటి,మీ moral పోలీసింగ్ ఏమిటండి?కూడా పట్టుకుతిరుగుతామా ఏంటి అని వెటకారం గానే అన్నారు. అదే విషయం తోడికోడలుతో అంటే..

ఏమి smartphone పట్టుకుని తిరగటానికి ఉన్నచేతులు ఓ స్టికర్ ప్యాకెట్ బ్యాలో పడేసుకోలేరా అని చెప్పాల్సింది అక్కఅంది..

నాకన్నా కట్టర్ ఐపోతోంది అనుకున్న. అదేమాట తనతో అంటే, అవ్వాలి అక్క లేకపోతే హిందువులు బ్రతికే పరిస్థితి ఉందా,

భాష వేషం లో మన ఐడెంటిటీ కోల్పోతే నువ్వెవరు అంటే ఏంచెప్పుకుంటారు మనపిల్లలు…

నా మాటలు నాకే చెప్పింది 😄

ఇంతకి తన పేరు చెప్పలేదుగా..

Dr స్రవంతి..

ఈ generation పిల్లలకి ముఖ్యంగా వారి తల్లి తండ్రులకి నా ది ఒకటే విన్నపం. చరిత్ర తెలుకోండి, సంస్కృతిని వదులుకోకండి, చదువుకి ఆచరణ అడ్డం కానే కాదు చదువుతో పాటు

మన భాష,వేషం, ఆహారం, కుటుంబం విలువలు ఇవే మనల్ని ప్రపంచ వేదిక మీద ప్రత్యేకంగా నిలబెడతాయి..

✒️ శారదా వాసుదేవ్ గారు..వాల్ స్ట్రీట్.. అమెరికా

Previous articleఎలుకలు తిన్న ఆహారాన్నివడ్డించేవారు.
Next articleమీరు తెలుగు వారైతే..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here