Home భక్తి సమాచారం వేలం పాట పేరిట వసూళ్లు

వేలం పాట పేరిట వసూళ్లు

84
0

అన్నవరం దేవస్థానం లో పురోహితుల వేలం పాట పేరిట వసూళ్లు కు అంకురార్పణ…….
దేవస్థానంలో శుభకార్యాలు చేసుకోదలచిన భక్తులకి టిక్కెట్ రూపంలో రుసుము విధించడం మాత్రమే దేవస్థానాల హక్కు, పరిధి.
వాళ్ళు ఏ పురోహితుడిని తెచ్చుకోవాలో నిర్ణయించే హక్కు దేవస్థానానికి లేదు.
సొంత/ ఇంటి/ నచ్చిన పురోహితుడిని తెచ్చుకుంటే దేవస్థానానికి కప్పం కట్టాలని ఓ దళారీని (వేలంపాట కాంట్రాక్టర్) పెట్టడం దారుణమైన విషయం.
పురోహితుల వేలంపాటట దీని పేరు!!


ఇదే జబ్బు రేపు అన్ని దేవస్థానాలకూ పాకుతుంది. దండగమారి ఖర్చు ఎందుకని జనం దేవస్థానాల్లో శుభకార్యాలు చేసుకోవడం తగ్గించేసుకుంటారు. ఇంటి శుభకార్యాలతో దేవాలయాలకి సంబంధం తగ్గిపోతే హిందూ సంప్రదాయాలు అడుగంటిపోతాయి.. తద్వారా ఆలయాలు కూడా ఆదాయం లేక అణగారిపోతాయి.
ఈ కుట్రల వెనుక అసలు ఆంతర్యం అదే!!
పురోహిత సంఘాలు ఈ ఆంతర్యాన్ని, అసలు ఉద్దేశాల్ని గమనించాలి. అసలు ఈ సమస్య పురోహితులది కాదు అని హిందువులందరూ గుర్తించాలి. ధర విషయంలో ప్రస్తుతానికి బేరం కుదిరినంతమాత్రాన సమసిపోయే సమస్య కాదిది.
దేవాదాయశాఖ ఉన్నది సంప్రదాయాల్ని కాపాడేందుకు.. అనే సత్యాన్ని ఆ శాఖ అధికారులు గుర్తించాలి.
హిందూ ధర్మ రక్షకులం అంటూ అనవసర విషయాలకి పూనకాలతో ఉగిపోయేవాళ్లు.. ఇది పురోహితుల సొంత సమస్య అనుకొని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.
ముందు దేవాలయ వ్యవస్థలకి పట్టిన చీడ వదలాలి. రేపు నది తీరం లో పితృ కాసర్యాన్నికి కూడా వైదిక పురోహితుడిని తెచ్చుకోవాలి అంటే వేలం పడుకున్న క్రిస్టోఫర్ కి రుసుము లేట్టాలి. కృష్ణ గోదావరి, నదులలు హస్తిక నిమజ్జనానికి, గోదానానికి, చతుర్మసా దీక్ష కు. పితృ తద్దినానికి. కూడదా పాటదారునికి పన్ను చెల్లించాలి.
హిందువులారా ఆలోచించండి

Next articleసీతాదేవికి అగ్ని పరీక్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here